నల్లగొండ : నల్లగొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా తొలిసారిగా ఒక్కరోజే ఆరుగురు వ్యక్తులకు కరోనా సోకినట్లు తేలడం సంచలనం సృష్టించింది. రెండు రోజుల కిందట జిల్లా కేంద్రంనుంచి నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 44మందిని పరీక్షలకు పంపించగా వారిలో 37మంది ఫలితాలు వచ్చాయి. వీరిలో నల్లగొండ పట్టణంలోని ఐదుగురికి, మిర్యాలగూడలో ఒకరికి కరోనా (కోవిడ్ –19) వైరస్ సోకినట్లు (పాజిటివ్) అని తేలింది. కాగా, బుధవారం మరో 17మంది బర్మా దేశస్తులను పరీక్షల కోసం తరలించారు. అంటే మరో 24 మంది రిపోర్టులు అందాల్సి ఉంది. కాగా, కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిన ఆరుగురిని హైదరాబాద్ క్వారంటైన్‌లో ఉంచారు. నెగిటివ్ వచ్చిన వారిని నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు.
పాజిటివ్.. ప్రకంపనలు!