ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ ఇదే..

హైదరాబాద్‌ : రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి నిర్దేశకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ వర్కింగ్‌ టైటిల్‌ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు చిత్ర రూపకర్తలు త్వరలోనే తెరదించనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రఘుపతి రాఘవ రాజారాం అని తాజా సమాచారం ప్రకారం తెలియవచ్చింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల పాత్రల్లో రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు కనిపించనున్న ఈ మూవీకి ఈ టైటిల్‌ కచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నారు.